ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొలగని నివర్ ప్రభావం: పొంగుతున్న వాగులు, వంకలు - నివర్ తుపాన్ తాజా వార్తలు

నివర్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దర్శి నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

రహదారిపై నుంచి ప్రవాహిస్తున్న నీరు
రహదారిపై నుంచి ప్రవాహిస్తున్న నీరు

By

Published : Nov 28, 2020, 4:34 PM IST

నివర్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దర్శి నుంచి అద్దంకి వెళ్లే మార్గంలో చిలకలేరు వాగు పొంగిన కారణంగా.. రాకపోకలు స్తంభించాయి.

దర్శి నుంచి తూర్పు గంగవరం, దర్శి నుంచి ఒంగోలు వెళ్లే మార్గాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. ఆ ప్రాంతాల్లోనూ రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రాత్రింబవళ్లు అక్కడే పహారా కాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details