పొగాకు రైతులనూ.. నివర్ తుపాను ముంచింది. నారుమళ్లు.. వరదకు కొట్టుకుపోయి.. ఇప్పుడెం చేయాలో తెలియని పరిస్థితి. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల నుంచి పొగాకు నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. మొక్కలు ఎదుగుతున్న సమయంలో నివర్ తుపాన్ తీవ్ర ఇక్కట్లకు గురిచేసింది. వేసిన మొక్కలు నీటిలో కొట్టుకుపోయి, కుళ్ళిపోయాయి. మరోసారి నారుమళ్లు వేసుకోలేని దుస్థితి.
నాగులుప్పలపాడు మండలం మద్దిరాలుపాడు ప్రాంతంలో గుండ్లకమ్మ నదీ ప్రవాహ తీరంలో నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు, అద్దంకి, నాగులప్పలపాడు తదితర మండలాల రైతులు ఇక్కడ నుంచి పొగాకు మెుక్కలు కొనుగోలు చేసి.. తీసుకువెళతారు. అయితే నివర్ తుపాన్‌తో కురిసిన వర్షాలకు నదీ ఉద్ధృతంగా ప్రవహించి.. నర్సరీలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.