ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NIMZ Project Completely Sidelined by CM Jagan: నిమ్జ్‌ ప్రాజెక్టుపై జగన్ నిర్లక్ష్యం.. పారిశ్రామిక ఉపాధి, అవకాశాలపై పెద్ద దెబ్బ - నిమ్జ్‌ ప్రాజెక్టుపై జగన్ నిర్లక్ష్యం

NIMZ Project Completely Sidelined by CM Jagan : ఎక్కాల్సిన ట్రైను జీవితకాలం లేటన్నది పాత సామెత..! పారిశ్రామికవేత్తల ఫోన్‌ కాల్‌కు.. జగన్ జీవితకాలం దూరమన్నది నయా నిజం. సీఎం సభల్లోనూ, మీడియా ముందు పెట్టుబడిదారులు ఫోన్ చేస్తే చాలు స్పందించే ప్రభుత్వం మాది అంటూ ఊదరగొడతారు. ప్రకాశం జిల్లాలో నిమ్జ్‌ ప్రతిపాదనకు మరి జగన్‌ ఏం చేశారో ఆరా తీస్తే.. చర్యలే కాదు సమాధానమూ శూన్యమే. పెట్టుబడులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై కనీస శ్రద్ధ కూడా పెట్టని పరిస్థితి.

NIMZ_Project_Completely_Sidelined_by_CM_Jagan
NIMZ_Project_Completely_Sidelined_by_CM_Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2023, 7:20 AM IST

NIMZ Project Completely Sidelined by CM Jagan: నిమ్జ్‌ ప్రాజెక్టును పక్కన పెట్టేసిన జగన్.. పారిశ్రామిక ఉపాధి, అవకాశాలపై పెద్ద దెబ్బ

NIMZ Project Completely Sidelined by CM Jagan :ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు వింటే.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం పెట్టుబడిదారులను ఎర్ర తివాచీతో స్వాగతం పలుకుతున్నారన్న భావన కలుగుతుంది. వాస్తవ పరిస్థితి ఇలాగే ఉందా? అంటే అంజనం వేసి వెదికినా కానరాదు. సీఎం జగన్ చెప్పిన ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నామన్న మాటకు అర్ధం జీవితకాలం దూరమన్న విషయం అందరికీ తెలిసొస్తోంది. ఫలితమే కీలకమైన పారిశ్రామిక రంగంలో మందకొడితనం.

YSRCP Government Stop The NIMZ Project in Prakasam District : ప్రకాశం జిల్లాలో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి- నిమ్జ్‌ (National Investment and Manufacturing Zones) ఏర్పాటు ప్రతిపాదన. దీని కోసం మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి పైసా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. కేంద్రం నిధులు తెచ్చుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే చాలు. ఇది కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేతకాలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకూడదన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా? వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకునేందుకే దానిని నిర్వీర్యం చేసి పక్కన పెట్టేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టుల పేర్లను మార్చి కొనసాగిస్తున్న జగన్ వెనుకబడిన ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధిపై ఎందుకు దృష్టి పెట్టలేదు? వైసీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా గత నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుపై ఒక్కడుగు ముందుకు పడలేదంటేనే సీఎం జగన్ చిత్తశుద్ధి అర్ధమవుతుంది.

పదేళ్లయినా జాడ లేని నిమ్జ్.. ప్రకాశం జిల్లాలో ఆగని వలసలు
జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి ఏర్పాటైతే రాష్ట్రానికి 4.37 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాజెక్టు నివేదికలో వాయంట్స్ సంస్థ పేర్కొంది. సుమారు 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఉపాధి లభిస్తాయని అంచనా. ఏటా 24వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులకు అవకాశం ఉంది.

Neglect of NIMZ Project : వాక్ టు వర్క్ విధానంలో ఫార్మా, రక్షణ, జనరల్ ఇంజినీరింగ్, లాజిస్టిక్స్ రంగాలకు వేర్వేరుగా పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేసేలా పారిశ్రామికవాడల అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఇందుకోసం 14వేల 346.61 ఎకరాల అవసరమవుతాయని కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. అప్పట్లోనే 7వేల 735.34 ఎకరాలను సేకరించింది. ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ తయారీకి 2016-17లో కేంద్రం 3.35 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిమ్జ్‌ ఏర్పాటును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
నిధుల కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల ఎదురుచూపులు.. నత్తనడకన పనులు
ప్రకాశం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే నిమ్జ్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేదనే ప్రశ్న సమాధానం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కకుండా జగన్ సర్కారు అడ్డుపుల్ల వేసినట్లయింది. ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువత ఆశలు పూర్తిగా నీరుగారిపోయాయి.

కేంద్రం ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు ఇస్తామన్నా వాటిని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించలేని స్థితికి జగన్‌ ప్రభుత్వం దిగజారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ, మాస్టర్ ప్లాన్‌ పనులతో ప్రాజెక్టులో కొంత కదలిక వచ్చినా.. దానిని వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనికోసం సేకరించిన వేలాది ఎకరాలు వృథాగా పడివున్నాయి.
NIMZ: నిమ్జ్‌ పర్యావరణ అనుమతులకు సిఫార్సు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details