తెదేపా ఖాతాలో మరో ఏకగ్రీవం చేరింది. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం సర్పంచ్ పదవికి తెదేపా బలపరిచిన తూమాటి శ్రీనివాసరావు ఒక్కరే బరిలో నిలిచారు. ఆయనతో పాటు నామినేషన్ వేసిన సామినేని సుబ్బారావు బుధవారం నామినేషన్ ఉపసంహరించుకున్నారని రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. నీలాయపాలెం పంచాయతీలో మొత్తం ఆరు వార్దులుండగా .. అన్ని చోట్లా ఒకొక్కరే బరిలో ఉండగా అవి కూడా ఏకగ్రీవం కానున్నాయి. వీరి గెలుపును అధికారికంగా ప్రకటించాల్సిఉంది.
నీలాయపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం! - ఏపీలో పంచాయతీ ఎన్నికలు వార్తలు
ప్రకాశం జిల్లాలో మరో పంచాయతీ ఏకగ్రీవమైంది. సర్పంచి పదవికి తెలుగుదేశం అభ్యర్థి ఒక్కరే నిలబడిన కారణంగా... నీలాయపాలెం స్థానం ఏకగ్రీవమైంది. అధికారులు తుది ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
నీలాయపాలెం సర్పంచ్ పదవి ఏకగ్రీవం