ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పేరంబజార్లో భారీ చోరీ జరిగింది. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి గొట్టెముక్కల సత్య విజయ్ ఇంట్లో తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సుమారు రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బాధిత కుటుంబం వారం రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి... సాయంత్రం తిరిగి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పది రోజుల క్రితం కంభం రోడ్డులోని ఫెర్టిలైజర్ దుకాణంలో రూ.10 వేల నగదు అపహరణకు గురైంది. మూడు రోజుల క్రితం ఒకేసారి మూడు దుకాణాల్లో రూ.20 వేలు నగదు, రెండు చరవాణిలు చోరీకి గురయ్యాయి.
మార్కాపురంలో రూ.11 లక్షల బంగారు ఆభరణాలు చోరీ - markapuram lo chory news
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వరుస దొంగతనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు రోజుల క్రితం కంభం రోడ్డులోని మూడు దుకాణాల్లో నగదు చోరీ ఘటన మరువక ముందే... పేరంబజార్లోని ఓ ఇంట్లో దాదాపు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం పోలీసులు