ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉక్రెయిన్ ఆసక్తి - News of setting up of Aero Tro Police in Prakasam district

ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఓ ప్రైవేట్‌ సంస్థ ఆసక్తిగా ఉంది. దొనకొండ ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు......... ఓ ప్రైవేట్‌ సంస్థ ఆసక్తిగా ఉంది. దొనకొండ ప్రాంతంలో 24 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్రెయిన్‌కు చెందిన సంస్థ.....ఏరో ట్రో పోలీస్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండో ఉక్రెయిన్‌ టెక్నాలజీ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రాం పేరిట సంస్థ సమర్పించిన ప్రతిపాదనను...... అధ్యయనం చేసిన ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయబోతోంది.

ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉక్రెయిన్ ఆసక్తి
ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉక్రెయిన్ ఆసక్తి

By

Published : Mar 15, 2021, 5:33 AM IST

ప్రకాశం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉక్రెయిన్ ఆసక్తి

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు, మంగినపూడి, మల్లంపేట, అనంతవరం గ్రామాల సమీపంలో 6వేల ఎకరాల్లో ఏరో ట్రో పోలీస్ ఏర్పాటుకు ఉక్రెయిన్‌కు చెందిన....... ఓ ప్రైవేట్‌ సంస్థ ఆసక్తి చూపుతోంది. విమానాల తయారీ, సర్వీసింగ్, శిక్షణ, అంతర్జాతీయ రవాణా సేవల వంటి 4 రకాల సేవలను ప్రతిపాదిస్తోంది. ఇప్పటి వరకు... దేశీయంగా నడిచే విమానాలు, హెలీకాఫ్టర్లు మరమ్మతులకు గురైతే ఇతర దేశాలకు తీసుకెళ్లి బాగుచేయించే వారు. ఈ ప్రాజెక్టు వస్తే..... ఇక్కడే ఇవన్నీ చేయవచ్చని సంస్థ చెప్తోంది. తెలుగు రాష్ట్రాల్లో శంషాబాద్‌ విమానాశ్రయం తర్వాత ప్రయాణ, రవాణా సౌకర్యాలు కలిగిన విమానాశ్రయం లేదు. దొనకొండ ప్రాంతం నుంచి...ఈ తరహా విమాన సేవల ఏర్పాటుకు అవకాశం ఉందని అంటోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరుతోపాటు తెలంగాణకు చెందిన నల్గొండ జిల్లాకు అనువుగా ఉండేలా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు

విమాన సేవలతోపాటు కార్గో సేవలూ.. ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రానైట్‌, మిర్చి, పొగాకు, ఆక్వా ఎగుమతులకు ఇది అనుకూలంగా ఉండనుంది. ప్రయాణ, రవాణాకు సంబంధించిన విమానాల తయారీని ఇక్కడ చేపడతారు. విమానాల తయారీలో 90 ఏళ్ల అనుభవం ఉన్న ఏన్టోనోవ్‌తో ఈ సంస్థ ఒప్పందం చేసుకోబోతోంది. తక్కువ సీటింగ్ సామర్థ్యం కలిగిన విమానాలను ఇక్కడ తయారు చేస్తారు. ఈ ప్రాంతంలోనే 5కిలోమీటర్ల పొడవుతో 2 రన్‌వేలు నిర్మిస్తారు. ఎమ్.ఐ. సిరీస్‌ హెలికాప్టర్లు, విమానాల మెంటైనెన్స్‌, మరమ్మతులకు సంబంధించిన విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. విమానయాన సంస్థల్లో పనిచేసే వివిధ కేటగిరీల సిబ్బందికీ ఇక్కడే శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఏవియేషన్‌ అకాడమి ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్‌, కమర్షియల్‌ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఉంటుంది. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు . పైగా వేలాది మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉన్నందున దీనిపై అధికారికంగా త్వరలో ప్రభుత్వం ప్రకటన చేయనుంది. వెనుకబడిన జిల్లాకు ఇలాంటి భారీ ప్రాజెక్టులు వస్తే రూపురేఖలు మారిపోతాయని నిపుణులు అంటున్నారు. ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నారు.


ఇవీ చదవండి

ప్రకాశంలో ఫ్యాన్​ గాలి.. ఒంగోలు కార్పొరేషన్​పై వైకాపా జెండా

ABOUT THE AUTHOR

...view details