అక్రమ మద్యాన్ని పోత్సహిస్తుంది స్దానిక నాయకులేనని మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఓట్ల కోసమే ప్రోత్సహిస్తున్నారని... ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరులో పర్యటించిన ఆయన... రాష్ట్రంలో గంజాయి, నాటుసారా అక్రమంగా విక్రయాలు జరుగుతున్నాయని.. ఎక్సైజ్ సిబ్బంది కొరతవల్ల అక్రమాలు పెరిగిపోయాయని వీటిని హోమ్ మంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో 13 చోట్ల మద్యానికి బానిసలయిన వారికి ఉచితంగా చికిత్స చేస్తున్నారని చెప్పారు. కొన్నిచోట్ల లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను లూఠి చేయటం, దొంగతనాలకు పాల్పడటం జరిగిందని, బార్ అండ్ రెష్టారెంట్ యజమానులు మద్యం బయటకు తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు.
'ఓట్ల కోసమే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు'
సమాజ అభివృద్ధి కోసమే దశలవారీగా మద్యం నిషేధం అమలు చేస్తున్నారని... మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి ఉద్ఘాటించారు. ప్రకాశం జిల్లా పర్చూరులోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను లక్ష్మారెడ్డి సందర్శించారు.
ఓట్ల కోసమే మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తున్నారు