ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలలో కొత్త ఐసోలేషన్‌ వార్డు.. క్వారంటైన్‌కు సర్వం సిద్ధం - riims

చీరాల నవాబ్‌పేటకు చెందిన దంపతులకు కరోనా పాజిటివ్‌ రావటంతో యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. వారితో కలిసి దిల్లీ వెళ్లిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంది. వారి బంధువుల వివరాలు, వారు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే గుర్తించిన వారిని జీజీహెచ్‌(రిమ్స్‌)లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నారు.

New Isolation Ward in chirala  Preparing for  Quarantine
చీరాలలో కొత్త ఐసోలేషన్‌ వార్డు.. క్వారంటైన్‌కు స్వరం సిద్ధం.

By

Published : Mar 30, 2020, 4:15 PM IST

Updated : Mar 30, 2020, 4:33 PM IST


ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి చుట్టు పక్కల వారిని వారు తిరిగి ప్రాంతాల వారిని ఐసోలేషన్‌ వార్డులో పెట్టటానికి సర్వం సిద్ధమయింది. చీరాల ఏరియా ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో అదనంగా పడకలు ఏర్పాటు చేశారు.

ఎక్కడికక్కడే సేకరణ...

అందరినీ జీజీహెచ్‌కు తీసుకువస్తే నమూనాల సేకరణ కష్టమవుతుందని భావించిన యంత్రాంగం- చీరాల, మార్కాపురంలోనూ అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు కిట్లను అక్కడికి పంపించింది. ఆ ప్రాంతాల్లో గుర్తించిన వారికి అక్కడే నమూనాలు సేకరిస్తారు. జీజీహెచ్‌లో 25 మందికి నమూనాలు తీయగా- ఇతర ప్రాంతాల్లో సుమారు 75 తీస్తారని అంచనా.

జీజీహెచ్‌లో కొందరిని ప్రత్యేక గదుల్లో ఉంచారు. పాజిటివ్‌ వచ్చిన దంపతుల కుమారుడు, కోడలు, మనుమరాలి నమూనాలను ఆదివారం మధ్యాహ్నం పరీక్షకు పంపారు. వాటి ఫలితాలు సోమవారం సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్‌ వచ్చిన వారితో దగ్గరగా ఉన్నందున 28 రోజులు వారిని పరిశీలనలో ఉంచుతారు. దిల్లీకి వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులను ఆయా ప్రాంతాల్లోనే క్వారంటైన్‌ వార్డుల్లో ఉంచుతారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే జీజీహెచ్‌కి తీసుకొస్తారు.

సర్వేకు ప్రత్యేక బృందాలు

నవాబ్‌పేట ప్రాంతంలో ఇంటింటి సర్వే నిమిత్తం ప్రత్యేకంగా 35 బృందాలను ఏర్పాటు చేసినట్లు మండల వైద్యాధికారి శ్రీదేవి తెలిపారు. 14 రోజుల పాటు నిత్యం సర్వే కొనసాగుతుందన్నారు. బృందాలకు స్థానిక ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌లో ఆదివారం ప్రత్యేక శిక్షణ అందించారు.

పర్యవేక్షకునిగా జడ్పీ సీఈవో

చీరాల ప్రాంతంలో కరోనా కట్టడికి పర్యవేక్షకునిగా జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌ నియమిస్తూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన డిప్యూటీ డీఎంహెచ్‌వోలు మాధవీలత, డి.సాంబిరెడ్డి, మెప్మా పీడీ కె.కృపారావు, చీరాల పరిధిలోని పలువురు అధికారులు, వైద్యులను సమన్వయం చేస్తూ... కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటారు.

ఇదీ చూడండి:

సామాజిక దూరంపై.. పట్టింపు లేదా?

Last Updated : Mar 30, 2020, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details