ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తిగత ఖాతాలు తెరిచేందుకు జనం పోటాపోటీ - ప్రకాశం

ప్రకాశం జిల్లాలోని ఆంధ్రా బ్యాంకు ప్రాంగణం చిన్నపాటి జనసంద్రాన్ని తలపించింది. బ్యాంకు గేటు తెరవకముందే ప్రజలు బయట బారులు తీరారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇలా బ్యాంకు రద్దీగా మారింది.

జనసంద్రంగా మారిన బ్యాంకు పరిసరాలు

By

Published : Jul 18, 2019, 2:12 AM IST

జనసంద్రంగా మారిన బ్యాంకు పరిసరాలు

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం ఆంధ్రబ్యాంకు ప్రాంగణం జనసంద్రంగా మారింది. వ్యక్తిగత ఖాతా తెరిచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్యాంకు గేటు తెరవకముందే ప్రజలు బారులు తీరారు. ఇంతకీ రద్దీ ఎందుకంటే... ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మఒడి కార్యక్రమం, ఏక రూప దుస్తుల నగదు కోసం పాఠశాలల్లో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 27 వరకే గడువు ఉంది. ఇందుకు తోడు... వెబ్ సైట్లో ప్రాంతీయ బ్యాంకుల ఖాతాలు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఈ కారణంగా... ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకులో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో.. భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ కారణంగా.. కాస్త తోపులాట జరిగింది.

ABOUT THE AUTHOR

...view details