నివర్ తుపాను ప్రభావం...నిలిచిపోయిన వాహనాలు - ప్రకాశం జిల్లా నివర్ తాజా వార్తలు
నివర్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతోంది. రాజుపాలెం చెక్ పోస్టు వద్ద ఉన్న పార్కింగ్ ఏరియాకు వాహనాలను ఎస్ఐ శివకుమార్ తరలిస్తున్నారు. వర్షాలు తగ్గేవరకు ఉండాలని వాహన చోదకులకు సూచిస్తున్నారు.
![నివర్ తుపాను ప్రభావం...నిలిచిపోయిన వాహనాలు Never impact on the national highway stalled vehicles at prakasham district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9679287-1090-9679287-1606459876622.jpg)
ప్రకాశం జిల్లా జాతీయ రహదారిపై నివర్ ప్రభావం...నిలిచిపోయిన వాహనాలు
నివర్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై వరదనీరు పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా 16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు నిలువరిస్తున్నారు. మార్టూరు మండలం డేగరమూడి - కోనంకి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదకర స్థాయిలో వరదనీరు పారుతోంది. రాజుపాలెం చెక్ పోస్టు వద్ద ఉన్న పార్కింగ్ ఏరియాకు ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో వాహనాలను తరలిస్తున్నారు. వర్షాలు తగ్గేవరకు ఉండాలని వాహన చోదకులకు సూచిస్తున్నారు.