మనదైతే ఆలోచించాలి..ప్రజాధనం కదా ఎటుపోతే మనకెందుకులే అనే రీతిలో అధికారులు ప్రవర్తిస్తున్నారు. ప్రజా అవసరాల కోసం రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన యంత్రాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నగరపంచాయతీలో రహదారులు శుభ్రం చేసేందుకు అధునాతన యంత్రాన్ని కొనుగోలు చేశారు. రెండు మూడు రోజులు నడిపించారు. మరమ్మతుకు గురైందని ఏడాదిగా మూలన పడేశారు.
నగరపంచాయతీలో పార్కు ఏర్పాటు చేసి అందులో వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి కిట్లు, వస్తువులు తీసుకొచ్చారు. ఇంత వరకు వాటిని బిగించలేదు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ పోయినపుడు ఉపయోగించేందుకు పెద్ద జనరేటర్ కొనుగోలు చేశారు. అదీ నిర్లక్ష్యానికి గురైంది.