ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కాశికుంటా తండా శివారులో నాటుసారా స్థావరాలపై స్పైషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. నాటు సారా తయారీకి సిద్ధం చేసి ఉన్న 3500 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.
3500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం..40 లీటర్ల సారా స్వాధీనం - ప్రకాశం జిల్లా
మద్యం ధరలు పెరగటంతో నాటుసారాకు మంచి గిరాకీ పెరిగింది. ఆబ్కారీ అధికారులు నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు జరుపుతున్నా వారి కళ్ళు గప్పి మారుమూల ప్రాంతాల్లో సారాను తయారు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో 3500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
3500 బెల్లం ఊట ధ్వంసం..40 లీటర్ల సారా స్వాధీనం