ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో నాటు సారా స్థావరాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. యర్రగొండపాలెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలోని మూడు మండలాల్లో రోజురోజుకూ సారా దందా అధికమవుతోంది. కొందరు అటవీ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తయారు చేస్తున్నారు. ఆబ్కారీ అధికారులు దాడులు చేస్తూ వారి చర్యలను కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి సారా శిబిరాలపై దాడులు నిర్వహించగా.. ఈ ప్రాంత పరిధిలో ఇప్పటి వరకు 31 కేసులు నమోదయ్యాయి. 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 265 లీటర్ల నాటు సారా, అక్రమంగా తరలిస్తున్న 50 లీటర్ల మద్యం, 640 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8,630 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 15 ద్విచక్రవాహనాలు, ఒక కారు సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ వరదా శ్రీనివాసులు తెలిపారు.
యర్రగొండపాలెంలో నాటుసారా అక్రమ దందాపై చర్యలు
కరోన వైరస్ నివారణ చర్యలో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూత పడ్డాయి. ఈ క్రమంలో గ్రామాల్లో నాటుసారా తయారీ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు ఆబ్కారీ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నా.. కొందరు వారి కళ్లుగప్పి మరీ.. సారా కాస్తున్నారు.
natu sara illegal business
Last Updated : May 1, 2020, 1:01 PM IST