ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మహిళల రక్షణకు అన్ని వ్యవస్థలు పనిచేయాలి' - ఏపీ న్యాయసేవాధికార సంస్థ తాజా వార్తలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో నల్సా ఆధ్యర్యంలో మహిళలు, బాలికల హక్కులు చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది. మహిళలకు స్వేచ్ఛనివ్వాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జ్యోయ్‌ మాల్యాబాగ్చి పేర్కొన్నారు. మహిళలు, బాలల హక్కుల పరిరక్షణకు అన్ని వ్యవస్థలు పనిచేయాలని జస్టిస్ ఎం.వి.రమణ అన్నారు.

nalsa awareness programs on women acts
nalsa awareness programs on women acts

By

Published : Apr 5, 2021, 9:05 PM IST

నల్సా సదస్సు

మహిళలకు రక్షణతోపాటు స్వేచ్ఛ ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జ్యోయ్‌ మాల్యాబాగ్చి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నల్సా ఆధ్యర్యంలో మహిళలు, బాలికల హక్కులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా కేసులు పెరుగుతున్నాయని.. బాధితులైన మహిళలకు కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలవాలని జస్టిస్​ మాల్యాబాగ్చి అన్నారు.

మహిళలకు న్యాయం అందించేందుకు న్యాయసేవాధికార సంస్థ పనిచేస్తుందని జస్టిస్ ఎం.వి.రమణ అన్నారు. మహిళలు, బాలల హక్కుల పరిరక్షణకు అన్ని వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ కౌశిల్​ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: అనిశా నివేదికతో.. వెలుగులోకి దుర్గ గుడి ఈవో తప్పిదాలు

ABOUT THE AUTHOR

...view details