ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు..స్థానికుల్లో ఆనందం - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు
నల్లమల అటవీ ప్రాంతంలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఏనుమాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
![ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు..స్థానికుల్లో ఆనందం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4500875-thumbnail-3x2-nalla.jpg)
nallamala-forest-latest
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏనుమాలేరు
నల్లమల అటవీ ప్రాంతంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... ప్రకాశం జిల్లాలోని గుండ్లమోటు ప్రాజెక్టు నిండింది. గిద్దలూరు మండలం వెంకటాపురం వద్దనున్న గుండ్లమోటు ప్రాజెక్టు నిండి నీరు దిగువకు పారుతోంది. దీనివల్ల ఏనుమాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గత ఆరేళ్లలో వాగు ఇంత నిండుగా ఎప్పుడూ ప్రవహించలేదని స్థానికులు తెలిపారు. వాగు ప్రవహించే 70 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తీరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.