ప్రకాశంజిల్లా పొదిలిలోని నాగశ్రీనివాసరావు,ఉషారాణిల కుమార్తె నాగశ్రీచరిత.తండ్రి ఓ ప్రైవేట్ పాఠశాలలో లెక్కల టీచర్,తల్లి గృహిణి. వీరికి ఒక అబ్బాయి,ఒక అమ్మాయి. అబ్బాయి సంగీతం మీద అమ్మాయి నాట్యం మీద ఆసక్తి చూపుతున్నారు. విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు సెల్ ఫోన్ ద్వారా వారి స్వీయ పర్యవేక్షణలో పిల్లలిద్దరిచేత సాధన చేయించారు.అలాగే భగద్గీతలోని శ్లోకాలను నేర్పించారు. నాగశ్రీచరిత శ్లోకాల కంఠస్త పోటీల్లో పలుమార్లు పాల్గొని రాష్ట్ర,జిల్లాస్థాయిలో బహుమతులు గెలుచుకుంది. భరత నాట్యంలోనూ ప్రావీణ్యం కనబరుస్తుంది. పొదిలిలో పలు సందర్భాలలో జరిగిన సభలలో ప్రదర్శనలిచ్చింది. మండలంలోని కంభాలపాడులో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ప్రదర్శించి అప్పటి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ చేతులమీదుగా అవార్డు అందుకుంది. ఇలా పొదిలిలో జరిగే ముఖ్యమైన సభలలో ప్రదర్శించి సన్మానాలు పొందుతుంది...ఈచిన్నారి.నాట్యంలోనే కాదు భగవద్గీత శ్లోకాలు, ఆత్మరక్షణ విద్య కరాటేలో రాణిస్తుంది నాగశ్రీచరిత. సరైన గురువులు వద్ద శిక్షణ పొందితే ఇంకా చాలా బాగా రాణించగలను అంటుంది. మరింత శిక్షణ కోసం ఎవరైనా సాయం చేయాలని కోరుకుంటుంది.
సంగీతం,నాట్యంలో నాగ శ్రీ 'చరిత' భళా! - naga charitha news in ongole
పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు అంటున్నారు... ఈ పిల్లలిద్దరూ. వీరు చదువుతో పాటుగా భగవద్గీతలోని శ్లోకాలు, నాట్యంలో రాణిస్తున్నారు. వీరి మక్కువను మెచ్చిన తల్లిదండ్రులు పలు పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సాహించారు.జిల్లా,రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటుకుంటున్నారు. తమ పిల్లలకు మరింత చేయూతనివ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
సంగీతం,నాట్యంలో నాగ శ్రీ 'చరిత' భళా!
TAGGED:
naga charitha news in ongole