ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ - యర్రగొండపాలెంలో యువకుడు హత్య వార్తలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కోలుకులలో గత నెలలో హత్యకు గురైన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు. దూరపు బంధువే అతడిని చంపినట్లు నిర్ధరించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

murder cases chased by police in yerragondapalem prakasam district
హత్యకేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ

By

Published : Jul 5, 2020, 9:44 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కోలుకులలో గత నెలలో హత్యకు గురైన యువకుడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సండ్రపాటి వెంకటయ్య అనే యువకుడు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో చెర్లో తండా దగ్గర్లోని కొండ ప్రాంతంలో కాలిన గాయాలతో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాన్ని కనుగొన్నారు. అది వెంకటయ్యదిగా గుర్తించారు. దీనిపై విచారణ చేసి శనివారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 బైక్​లు, ఒక సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మృతుడు వెంకటయ్య వీరభద్రపురంలో జూదం ఆడేందుకు వెళ్లాడు. పేకాటలో డబ్బులు పోగొట్టుకుని తన దూరపు బంధువైన చిన్న దావీదు ఇంట్లో ఆరోజు బస చేశాడు. వెంకటయ్య తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం చూసిన దావీదు అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు. మరో ముగ్గురితో కలిసి పథకం రచించాడు. తర్వాతి రోజు పేకాట ఆడదామని చెప్పి వెంకటయ్యను బైక్​పై ఎక్కించుకుని కొండపైకి తీసుకెళ్లి కొట్టి చంపారు. అనంతరం పెట్రోలో పోసి తగులబెట్టారని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

కర్ణాటక మద్యం పట్టివేత... మూడు వాహనాలు సీజ్

ABOUT THE AUTHOR

...view details