ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి, బిడ్డ దహనం కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంట హత్యల కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విచారించామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. మృతుల ఆచూకీ కోసం రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, 7 గురు సీఐలు, 25 మంది పోలీసుల బృందంతో విచారణ చేసి కేసుని ఛేదించామని చెప్పారు. మృతురాలికి తండ్రి లేనందున, తల్లి రాష్ట్రంలో నివాసం ఉండకపోవడం వల్ల మృతుల వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని వివరించారు. అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగించుకుని... అనేక ప్రదేశాలలో కేసు విచారణ చేపట్టామని పేర్కొన్నారు. చివరికి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి స్టోర్లో పనిచేసే అద్దంకి కోటేశ్వరరరావు... భార్య శ్రీలక్ష్మి, కూతరు వైష్ణవిలను దహనం చేసినందున అరెస్టు చేయడం జరిగిందన్నారు. భార్య మీద అనుమానంతోనే నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు.
తల్లీబిడ్డ దహనం కేసులో నిందితుడి అరెస్ట్ - ప్రకాశం జిల్లా తాజా క్రైమ్ వార్తలు
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తల్లి, బిడ్డ దహనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై వివరాలను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు.
'భార్యపై అనుమానం... హత్యకు పన్నాగం'