ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గలిజేరగుళ్లలో… భార్యను హత్య చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 27న గ్రామానికి చెందిన దూదేకుల బాజీ.. తన భార్య ఖాజాబీపై అనుమానంతో బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి నిందితుడు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని కంభం మండలం రావిపాడు జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకొని.. అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భార్యను చంపిన భర్త అరెస్ట్ - అరెస్ట్
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గలిజేరగుళ్లలో జరిగింది.
నిందితుడు అరెస్ట్