ప్రకాశం జిల్లా చీరాల పురపాలక కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. తొలగించిన ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికుల స్థానంలో సూపర్ వైజర్‌ల నియామకం చెల్లదని.. వీటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పురపాలక ఇన్‌ఛార్జి కమిషనర్ ఏసయ్యకు వినతిపత్రం అందజేశారు.
'తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' - చీరాల పారిశుద్ధ్య కార్మికుల నిరసన
తొలగించిన ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
!['తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి' municipal workers protest at chirala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9634967-66-9634967-1606121277902.jpg)
కార్మికుల నిరసన