ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కమీషనర్ నయీం అహ్మద్, తన ఇంట్లో పనిచేస్తున్న కార్మికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాండంటూ..రెండో రోజు విధులు బహిష్కరించారు పారిశుద్ద కార్మికులు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట సామూహిక ధర్నా చేపట్టిన పారిశుద్ద కార్మికులు బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల్లో చేరేది లేదని ప్రకటించారు. కమీషనర్‌ను విధుల్లోనుండి తొలగించిన తరువాతే, తాము విధులకు హజరవుతామని వారు తెలిపారు.
కమీషనర్‌ను తొలగించాలని మున్సిపల్ కార్మికుల ధర్నా - మార్కాపురం
ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ పారిశుద్ద కార్మికులు ఆందోళన. తన ఇంట్లో పనిచేస్తోన్న కార్మికురాలితో మున్సిపల్ కమీషనర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ..రెండో రోజు విధులు బహిష్కరించిన పారిశుద్ద కార్మికులు.
ధర్నా చేస్తున్న మున్సిపల్ కార్మికులు
Last Updated : Aug 19, 2019, 4:48 PM IST