ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలకు, గిద్దలూరు, అద్దంకి, కనిగిరి, చీమకుర్తి నగరపంచాయతీలకు ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో 9వ తేదీన ఎన్నికల సామగ్రి పంపిణీ, 10 వతేది పోలింగ్ అనంతరం అదే కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. 14వ తేదీన కౌంటింగ్ ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.
చీరాల:
వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అందరూ సహకరించాలని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ పీ.ఎసయ్య కోరారు. చీరాలలోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో 33 వార్డులకు బరిలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులను నిర్వహించేందుకు బూత్ లెవల్ ఆఫీసర్స్‌గా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగులను నియమించమన్నారు.