ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ స్థానాల నామినేషన్లు అధికారులు నిలిపివేశారు. పొదిలి మండలం ఎంపీపీ అభ్యర్థిగా బీసీ మహిళకు ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. అయితే తాజాగా పొదిలి మేజర్ పంచాయతీ నగర పంచాయతీగా మార్చారు. మొత్తం 19 ఎంపీటీసీ స్థానాల్లో పొదిలిలో పది స్థానాలు నగర పంచాయతీ పరిధిలోకి వస్తాయి. దీంతో నగర పంచాయతీలో కలిసిన 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఎన్నికలు జరగాల్సిన తొమ్మిది స్థానాల్లో బీసీ మహిళ ఎంపీటీసీ అభ్యర్థి రిజర్వు లేకపోవడంతో నామినేషన్లు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల పరిశీలకులు ప్రభాకర్ ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చాక నామినేషన్ల తేదీలు తెలియజేస్తామన్నారు.
పొదిలిలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా - local elections news at podili mandal
ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను అధికారులు నిలిపివేశారు. 10 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోగా తొమ్మిది స్థానాల్లో నామినేషన్లు వాయిదా పడ్డాయి.
పొదిలి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా