ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో పురపోరు... ఎవరి అదృష్టం ఎంత..? - municipal elections in prakasam district

కరోనా కారణంగా వాయిదా పడిన పుర ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలైంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు ఎన్నికల ఏర్పాట్లుపై రాజకీయ పార్టీలు, అధికారులు సమాయత్తం అవుతున్నారు.

municipal corporations
ప్రకాశం జిల్లాలో పుర పోరుకు సమాయత్తం

By

Published : Feb 16, 2021, 5:47 PM IST

ప్రకాశం జిల్లాలో నగర, పురపాలక సంస్థలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీ, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, దర్శి నగర పంచాయతీలు ఉన్నాయి. వాటిలో విలీన గ్రామాలకు సంబంధించి కోర్టు వివాదం కారణంగా కందుకూరు ఎన్నిక నిలిచిపోయింది. దర్శి నగర పంచాయతీని కొద్దిరోజుల క్రితమే ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ఎన్నికల నిర్వహణకు అనువుగా అక్కడ ప్రక్రియ పూర్తి కాలేదు. దర్శిలో కూడా ఎన్నికలు నిలిపివేశారు. మిగిలిన ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

ఒంగోలు కార్పొరేషన్‌..

ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌ పదవి ఎస్సీ(మహిళ)కు కేటాయించారు. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా ఎస్టీ (జనరల్)‌కు ఒకటి, ఎస్సీ(మహిళ)కు 4, ఎస్సీ(జనరల్)‌కు 5, బీసీ(మహిళ)కు 7, బీసీ(జనరల్)‌కు 7, జనరల్‌(మహిళ)కు 14, జనరల్‌ కేటగిరిలో 11 డివిజన్​లను కేటాయించారు. 50 డివిజన్‌లకు గానూ మొత్తం 462 నామినేషన్లు దాఖలయ్యాయి.

చీరాల మున్సిపాలిటీ..

ఇక్కడ ఛైర్మన్‌పదవి జనరల్‌ కేటగిరిలో ఉంది. 33 వార్డులు ఉండగా వాటిలో ఎస్టీ మహిళ1, ఎస్టీ జనరల్‌1, ఎస్సీ మహిళ 3, ఎస్సీ జనరల్‌ 4, బీసీ మహిళ 3, బీసీ జనరల్‌ 4, జనరల్‌ మహిళ 9, జనరల్‌ కేటగిరిలో 8 కేటాయించారు. ఈ మున్సిపాలిటీలో 318 నామినేషన్లు దాఖలయ్యాయి.

మార్కాపురం..

ఛైర్మన్‌ పదవి జనరల్‌ కేటగిరికి రిజర్వు అయింది. ఇక్కడ 35 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌కు1, ఎస్సీ జనరల్‌-2, ఎస్సీమహిళ 2, బీసీ జనరల్‌ 6, బీసీమహిళ 6, జనరల్‌ మహిళ 9, జనరల్‌ కేటగిరిలో 9 రిజర్వు చేశారు. ఇక్కడ 284 మంది పోటీలు ఉన్నారు.

చీమకుర్తి నగర పంచాయతీ...

ఇక్కడ ఛైర్మన్‌పదవి ఓసీ జనరల్‌కు రిజర్వు అయింది. 20 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌1, ఎస్సీ మహిళ-1, ఎస్సీ జనరల్‌-1, బీసీ జనరల్‌ 3,బీసీ మహిళ 3, జనరల్‌ మహిళ 6, జనరల్‌ కేటగిరిలో 4 కేటాయించారు. ఇక్కడ 86 నామినేషన్లు దాఖలయ్యాయి.

అద్దంకి నగర పంచాయతీ...

అద్దంకిలో ఛైర్మన్‌పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీ జనరల్‌ 2, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్‌ 3, బీసీ మహిళ 2, జనరల్‌ మహిళ 6, జనరల్‌ కేటగిరి 4 కేటాయించారు. ఈ పురపాలికలో పోటీ గట్టిగా ఉండబోతుంది. 20 వార్డులకు 132 మంది నామినేషన్‌ వేశారు.

కనిగిరి నగర పంచాయతీ...

ఛైర్మన్‌ పదవి‌ బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌1, ఎస్సీ జనరల్‌ 2, ఎస్సీ మహిళ1, బీసీ జనరల్‌ 3, బీసీ మహిళ 3, జనరల్‌ మహిళ 6, జనరల్‌ కేటగిరిలో 4 కేటాయించారు. మొత్తంగా 156 నామినేషన్లు దాఖలయ్యాయి.

గిద్దలూరు నగర పంచాయతీ..

ఈ ప్రాంతంలో ఛైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. అక్కడ 20 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌1, ఎస్సీ జనరల్‌1, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్‌ 4, బీసీ మహిళ 3, జనరల్‌ మహిళ 6, జనరల్‌ కేటగిరిలో 4 కేటాయించారు. 87 నామినేషన్ల దాఖలు కాగా రెండు తిరస్కరణకు గురవ్వగా 85 మంది పోటీలో ఉన్నారు.

ప్రతీ వార్డుల్లోనూ తెదేపా, వైకాపా ఆధ్వర్యంలో నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల వామపక్షాలు, భాజపా, జనసేన పార్టీల అభ్యర్థులు వేరువేరుగా నామినేషన్లు దాఖలు చేశారు.

ఇదీ చదవండీ..పుర పోరు: బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై ఎస్​ఈసీ స్పష్టత

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details