కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వన్ టౌన్ కోవిడ్ స్పెషల్ సీఐ రాజమోహన్, గ్రామీణ కోవిడ్ స్పెషల్ సీఐ రోశయ్య, మున్సిపల్ అధికారులు, వైకాపా యువ నాయకులు కరణం వెంకటేష్, రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి వరికుటి అమృతపాణి, మాజీ మంత్రి పాలేటి రామారావులు పాల్గొన్నారు. ప్రస్తుతం పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా నియంత్రణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
కరోనా నియంత్రణపై మున్సిపల్ కమిషనర్ సమీక్ష - Municipal Commissioner review meeting on corona
కమిషనర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు పలు అంశాలపై సమీక్షలో చర్చ జరిపారు.
![కరోనా నియంత్రణపై మున్సిపల్ కమిషనర్ సమీక్ష Municipal Commissioner review meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7880369-216-7880369-1593791792175.jpg)
కరోనా నియంత్రణపై మున్సిపల్ కమిషనర్ సమీక్ష