స్వచ్ఛ భారత్‌లో భాగంగా గ్రామాల్లో పరిశుభ్రతను నెలకొల్పేందుకు చెత్త సేకరణ కోసం గత సార్వత్రిక ఎన్నికల ముందు మండలానికి 15 ఆటోలు మంజూరయ్యాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఆటోలను అందిచాల్సి ఉంది. కాని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అవి నిరుయోగంగా ఉంటున్నాయి.
ఒక్కో ఆటో విలువ సుమారు రూ.1.25 లక్షలు.. మొత్తం 15 ఆటోల విలువ రూ.18.75 లక్షలు. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించాల్సిన ఆటోలు ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు సచివాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్నాయి. ఆరుబయటే ఎండా వానలోనే ఉంచడంతో తుప్పు పట్టి పనికి రాకుండా పోతున్నాయి.