రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెదేపా కార్యాలయంలో జరిగిన ఎస్సీ సెల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదివారం తిరుపతిలో జరగబోయే దళిత మహాసభలో పాల్గొనాలని విజయవంతం చేయాలని దళిత సోదరులు, సోదరీమణులు, తెదేపా నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
'తిరుపతిలో జరగబోయే దళిత మహాసభను విజయవంతం చేయండి' - tdp state sc cell president MS Raju
అదివారం తిరుపతిలో జరగబోయే దళిత మహాసభను విజయవంతం చేయాలని తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని తెదేపా కార్యాలయంలో జరిగిన ఎస్సీ సెల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
తిరుపతిలో జరగబోయే దళిత మహాసభను విజయవంతం చేయండి
తెదేపా హయాంలో దళితులకు అన్ని విధాలా న్యాయం చేశామని.. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిధుల కోరత సృష్టించి అన్ని వర్గాలను మోసం చేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగం పట్ల సీఎం జగన్ ప్రభుత్వానికిచిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి ఎస్‌ఈసీ లేఖ