కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వస్త్ర వ్యాపారులు సహకరించాలని ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ విజయలక్ష్మి అన్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నాగమల్లీశ్వరరావుతో కలిసి వస్త్ర వ్యాపారులతో ఆమె సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత పాటించాల్సిన విధి విధానాలు, దుకాణాలకు వచ్చే వినియోగదారులు పాటించాల్సిన జాగ్రత్తలపై వ్యాపారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు.
వస్త్ర వ్యాపారులతో తహసీల్దార్ సమావేశం
ప్రకాశం జిల్లా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ నాగమల్లీశ్వరరావుతో కలిసి వస్త్ర వ్యాపారులతో ఎమ్మార్వో సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం పాటించాల్సిన విధి విధానాలపై వారికి పలు సూచనలు చేశారు.
వస్త్ర వ్యాపారులతో ఎమ్మార్వో సమావేశం