ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తైతే.. సులభంగా రాకపోకలు' - surareddypalem railway under bridge update news

ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పరిశీలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణంతో పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు.

mp visit under railway bridge works
రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి

By

Published : Sep 28, 2020, 8:06 PM IST

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో రైల్వే గేటు 199 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టబోయే ప్రాంతాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జి కోసం ఎంపీ.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్​ను ఆయన అభ్యర్థించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ మేరకు కేంద్రమంత్రి అనుమతి ఇవ్వగా.. జాయింట్ ఇన్​స్పెక్టర్ బృందంతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కొన్ని గ్రామాలకు రాకపోకలు సులభతరం అవుతాయనీ.. త్వరతిగతిన పనులు ప్రారంభించేందుకు పరిశీలన బృందం కృషి చేయాలని ఎంపీ కోరారు.

ABOUT THE AUTHOR

...view details