Tiger is roaming in Prakasam district: ప్రకాశం జిల్లా అర్డవీడు మండలంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం నెలకొంది. మాగుటూరు లక్ష్మీపురం గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరించిన పెద్దపులి మరో ఆవును చంపేసింది. గ్రామ పరిసర ప్రాంతాలలో పెద్దపులి కనిపించడంతో గ్రామ ప్రజలు పెద్దగా కేకలు వేశారు. దీంతో పులు అడవిలోకి పారిపోయింది. సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు మాగటూరు, లక్ష్మీపురం గ్రామ పరిసర ప్రాంతాలను సందర్శించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. పది రోజుల క్రితమే ఈ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన అవును పెద్దపులి చంపేసింది. అంతేకాకుండా గురువారం అర్ధరాత్రి తర్వాత లక్ష్మీపురం గ్రామ పరిసర ప్రాంతంలోకి వచ్చిన పెద్దపులి ఆవును చంపేసింది. దీంతో స్థానిక గ్రామ ప్రజలు పెద్దపులి భయంతో వణికిపోతున్నారు.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి హల్చల్.. భయాందోళనలో గ్రామస్థులు - Forest Department officials
tiger is roaming in Prakasam district: ప్రకాశం జిల్లా అర్డవీడు మండలంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేగింది. మాగుటూరు, లక్ష్మీపురం గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరించిన పెద్దపులి మరో ఆవును చంపేసింది. దీంతో స్థానిక గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మాగటూరు, లక్ష్మీపురం గ్రామ పరిసర ప్రాంతాలను సందర్శించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మేత కోసం పశువులను అడవిలోకి పంపవద్దని రైతులకు సూచించారు.
tiger is roaming in Prakasam district
అటవీ శాఖ అధికారులు కూడా పులి సంచారాన్ని ధ్రువీకరిస్తూ పాదాల ముద్రలను సేకరించారు. పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో స్థానిక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. స్థానికంగా నల్లమల అటవీ ప్రాంతం ఉండడంతో పెద్దపులి ఆహారం కోసం తిరుగుతూ ఉందని.. మేత కోసం పశువులను అడవిలోకి పంపవద్దని రైతులకు అటవీ శాఖ అధికారులు సూచించారు. గత కొద్దిరోజులుగా అర్ధవీడు మండలంలోని వెలగలపాయ, కాకర్ల, లక్ష్మీపురం, మాగుటూరు గ్రామ ప్రజలు పెద్దపులి సంచారంతో భయంతో వణికిపోతున్నారు.
ఇవీ చదవండి: