పది లక్షల రూపాయల వ్యయంతో.. అద్దంకి పట్టణ ప్రజలకు శారీరక దృఢత్వాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో.. ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం వ్యాయామ పరికరాలు అందించింది. వాటిని పట్టణంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. పరికరాల కోసం ఓ బహిరంగ వ్యాయామశాలను ఏర్పాటు చేయాలని అద్దంకి నగర పంచాయతీ భావించింది. నెలలు గడుస్తున్నా... స్థల పరిశీలన పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. చివరకు వ్యాయామ పరికరాలను నగర పంచాయతీ ఆరుబయటే ఉంచుతోంది. అవి ఎండకు ఎండి వానకు తడిసి పోతున్నాయి. ఇప్పటికైన ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజాధనం నిరుపయోగం కాకుండా చర్యుల చేపట్టాలన్న స్థానికులు... త్వరగా వ్యాయామశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అద్దంకిలో నిరుపయోగంగా అత్యాధునిక జిమ్ పరికరాలు - అద్దంకిలో నిరుపయోగంగా జిమ్ పరికరాలు
ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీకి.. ప్రజల ఉపయోగం నిమిత్తం ఆధునిక వ్యాయామ పరికరాలను ప్రభుత్వం అందించింది. కానీ.. జిమ్ లేకపోవడం వల్ల.. అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి.

అద్దంకిలో నిరుపయోగంగా అత్యాధునిక జిమ్ పరికరాలు
అద్దంకిలో నిరుపయోగంగా అత్యాధునిక జిమ్ పరికరాలు