ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కత్తి మహేష్ మృతిపై విచారణ జరపాలి: మందకృష్ణ - latest news in ongole

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ మృతిపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

Mandakrishna Madiga
మందకృష్ణ మాదిగ

By

Published : Jul 14, 2021, 10:53 AM IST

సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ మృతిపై అనుమానాలున్నాయని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.నర్సయ్య తల్లి శాంతమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు.. ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్‌కాలనీకి మందకృష్ణ వెళ్లారు. ఇటీవల కారు ప్రమాదంలో గాయపడి కోలుకున్న కత్తి మహేష్‌... అకస్మాత్తుగా మృతి చెందడం వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

ప్రమాదం తీరు, అందించిన వైద్యం సైతం అనుమానాస్పదంగానే ఉందన్నారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. వైకాపా అధికారంలోకి రావాలని కోరుతూ ప్రతి నియోజకవర్గంలో పర్యటించిన మహేష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ వందనం, భిక్షాలు, రమేశ్, బీఎస్పీ నాయకులు దుడ్డు భాస్కరరావు, పరంజ్యోతి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details