ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నవరత్నాల పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేశారు' - mlc pothula sunitha comments

జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మొదటి ఏడాదిలోనే అమలు చేసిందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ అందేలా కృషి చేశారన్నారు.

'నవరత్నాల పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేశారు'
'నవరత్నాల పథకాలను ఏడాది కాలంలోనే అమలు చేశారు'

By

Published : May 26, 2020, 6:59 AM IST

అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి జగన్ అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ అందేలా కృషి చేశారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాలను మొదటి ఏడాదిలోనే అమలు చేసిందన్నారు.

రాబోయే ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించడం..,రాష్టాభివృద్ధి పట్ల సీఎం జగన్​ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నాయకత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details