రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే శక్తి కేవలం జగన్‌కే సాధ్యమని ...ఆటువంటి నాయకుడి అడుగు జాడలలో నడిచేందుకే వైకాపాలో చేరానని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. శాసన మండలిలో ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ పోతుల సునీత... అనుహ్యపరిణామాల మధ్య వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్‌ని కలిసి వైకాపాలో చేరిన తరువాత.. తొలిసారిగా ప్రకాశం జిల్లా చీరాలకు ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పోతుల దంపతులకు ఘన స్వాగతం పలికారు. కారంచేడు గేటు నుంచి చీరాల గడియార స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, వైయస్సార్, జ్యోతీరావు పూలే విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోతుల సునీత తెలిపారు. ఇంతకముందున్న పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొన్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపగలిగే వ్యక్తి కేవలం జగనే: ఎమ్మెల్సీ పోతుల - వైకాపా కండువ కప్పుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత
ఏపీని దేశంలోనే అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని... అందుకే మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతునిచ్చానని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. వైకాపా తీర్థం పుచ్చుకున్నాక తొలిసారి ఆమె ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించారు.

చీరాలలో ర్యాలీలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పోతుల సునీత