GADAPA GADAPA IN DARSI : ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో నాయకులు, ప్రజాపత్రినిధులకు ప్రజలు వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితినే ఎమ్మెల్యే వేణుగోపాల్ ఎదుర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌కు రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. సంక్షేమ పథకాలు అందడం లేదని కొందరు.. అసలు డబ్బులు ఖాతాల్లో పడటం లేదని మరికొందరు నిలదీశారు. సంక్షేమాలన్నీ పుస్తకం మీదనే కానీ.. ఖాతాల్లో ఎటువంటి డబ్బులు పడలేదని రిక్షా కార్మికుడు తెలిపారు.
సంక్షేమాలన్నీ పుస్తకాల మీదనే.. గడప గడపలో నాయకులకు తలెత్తున్న ప్రశ్నలు - gadapa gadapa program in darsi at prakasam
GADAPA GADAPA : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకు ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలం పుస్తకాల మీద మాత్రమే పథకాలు అందుతున్నట్లు ఉంటున్నాయి కానీ.. డబ్బులు మాత్రం రావట్లేదని మండిపడుతున్నారు.
![సంక్షేమాలన్నీ పుస్తకాల మీదనే.. గడప గడపలో నాయకులకు తలెత్తున్న ప్రశ్నలు GADAPA GADAPA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16719711-843-16719711-1666434687436.jpg)
GADAPA GADAPA
గడప గడపలో నాయకులకు తలెత్తున్న ప్రశ్నలు