ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం స్థాయిలో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఒంగోలులోని విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని సంఘ కాపరులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగీత కళాకారులు ఆటపాటలతో అలరింప చేశారు. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దైవ సేవకులందరికి ఎమ్మెల్యే దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సంతనూతలపాడులో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం స్థాయి సెమి క్రిస్మస్ వేడుకలను ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒంగోలులోని విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని సంఘ కాపరులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు