ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వేలాది మంది ఫార్వార్డ్ చేస్తారు.. వారినీ అరెస్టు చేస్తారా..?' - ongol latest political news

వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎమ్మెల్యే డీ.శ్రీబాల వీరాంజనేయస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపు చర్యలతో ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు.

mla fires on ycp govt
ఎమ్మెల్యే డి. శ్రీబాల వీరాంజనేయస్వామి

By

Published : Jul 18, 2020, 4:10 PM IST

తమిళనాడులో భారీగా పట్టుబడిన నగదుపై.. మంత్రి బాలినేనికి సంబంధం ఉందనే పోస్టును సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేసిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తెలుగుదేశం సానుభూతిపరులైన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలుకు చెందిన సందీప్, నాయుడుపాలెంకు చెందిన చంద్ర అనే యువకులను తాలుకా పోలీస్​స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.

దీనిపై ఎమ్మెల్యే డీ.శ్రీబాల వీరాంజనేయస్వామి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షసాధింపు, బెదిరింపు చర్యలతో భయాందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. పత్రికల్లోనూ, తమిళనాడుకు చెందిన టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు మాత్రమే వారు ఫార్వార్డ్ చేశారన్నారు. వేలాది మంది ఇది ఫార్వార్డ్ చేస్తుంటారనీ.. వారందర్నీ అరెస్టు చేస్తారా అని నిలదీశారు. తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా కేసులు పెట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:'అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details