ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మానవత్వం చాటుకున్నారు. మార్కాపురం సమీపంలోని పారిశ్రామికవాడ వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వగా...అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని గమనించారు. వెంటనే కారు దిగి గాయాలపాలైన యువకుడి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా 108 వాహనానికి ఫోన్ చేసి వైద్యశాలకు తరలించే వరకు అక్కడే ఉన్నారు.
ప్రమాదానికి గురైన వ్యక్తి.. ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి న్యూస్
ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించి ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మానవత్వం చాటుకున్నారు.
ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే