ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ - prakasham district latest updates

నివర్ తుపాన్ ప్రభావంతో హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, వ్యవసాయధికారులు పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

By

Published : Dec 1, 2020, 8:58 PM IST

ప్రకాశం జిల్లాలోని హనుమంతుని పాడు, కనిగిరి మండలాల్లో నివర్ తుపాన్ ప్రభావంతో ముంపునకు గురైన పంటలను ఎమ్మెల్యే మధుసూదన్, వ్యవసాయధికారులు పరిశీలించారు. నియోజకవర్గంలో 47 వేల ఎకరాలలోని మినుము, అలసంద, కంది, శనగ పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

వరదల వల్ల సంభవించిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, కౌలు రైతులకూ పరిహారం ఇస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు.. భూయాజమానులు పంట సాగు హక్కు పత్రం ఇవ్వాలని సూచించారు. ఈ క్రాప్​లో నమోదు చేసుకోని రైతులు ఈ నెల 5 వ తేదీలోగా సచివాలయాలలో లేదా వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

నివర్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా బృందం పరిశీలన

ABOUT THE AUTHOR

...view details