ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధి పనుల ప్రారంభంలో.. నిబంధనలకు తిలోదకాలు - mla maddisetty venugopal latest news

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.. దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. భౌతిక దూరం పాటించకుండా ప్రజలు గుంపులు గుంపులుగా గుమిగూడటం పై స్థానికులు ఆందోళన చెందారు.

mla maddisetty venugopal in dharshi
పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్

By

Published : May 25, 2020, 4:28 PM IST

ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో వేసవికాలంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి రానివ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హామీ ఇచ్చారు. నీటి ట్యాంకర్లను ప్రారంభించిన ఆయన అనంతరం లాక్​డౌన్​ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సరకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో ఎక్కడా భౌతిక దూరం పాటించిన దాఖలాలు కనిపించలేదు. ఈ కార్యక్రమాల్లో గుంపులు, గుంపులుగా జనం పోగవటాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details