ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడికి ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలి' - chirala latest news

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కరోనా నియంత్రణపై ఎమ్యెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మునిసిపల్ కౌన్సిల్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోన బారినపడి ఇబ్బంది పడుతున్న ప్రజలకు కరోనా హెల్త్ సెంటర్‌, ఐసోలేషన్ వార్డులో మెరుగైన సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.

mla karanam bhalarama murthi
ఎమ్యెల్యే కరణం బలరామకృష్ణమూర్తి

By

Published : May 3, 2021, 9:40 PM IST

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో కొవిడ్ వ్యాప్తి అరికట్టటంపై ఎమ్యెల్యే కరణం బలరామకృష్ణమూర్తి మునిసిపల్ కౌన్సిల్ హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కొవిడ్ కట్టడికి సహకరించాలని ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి కోరారు.

సమావేశంలో జెడ్పీ సీఈవో గిరీశ్ కైలాష్, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య, డీఎస్పీ శ్రీకాంత్, చీరాల ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ శేషుకుమార్, కరోనా హెల్త్ సెంటర్ ఇన్చార్జ్ నర్సింహారావు, చీరాల,వేటపాలెం తహసీల్దార్ లు హుస్సేన్, మహేశ్వరరావు, ఎండివోలు సాంబశివరావు, నేతాజీ, సీఐలు రాజమోహన్, రోశయ్య, పాపారావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details