ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించారు. అందరూ సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నిత్యావసర దుకాణాలు, కూరగాయల దుకాణ యజమానులతో మాట్లాడారు. సరైన రవాణా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే బలరాం దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వ్యాపారులకు ఎమ్మెల్యే చెప్పారు. లబ్దిదారులకు ఇంటికే రేషన్ సరుకులు పంపించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పర్యటన - @corona ap cases
ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంపై చీరాల శాశనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలోని కూరగాయల మార్కెట్ రహదారి, సంతబజార్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
చీరాలలో పర్యటించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి