ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడండి' - అధికారులతో ఎమ్మెల్యే కరణం బలరాం సమీక్ష

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం అధికారులను ఆదేశించారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఆయన... నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు.

Mla karanam balaram
Mla karanam balaram

By

Published : Nov 18, 2020, 9:31 PM IST

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులు చూడాలని ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. చీరాల తహసీల్దార్ కార్యాలయంలో... అధికారులతో ఎమ్మెల్యే బలరాం బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చీరాల, వేటపాలెం తహసీల్దారు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details