గ్రామ సచివాలయంలో ఉద్యోగుల గైర్హాజరుపై ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు సచివాలయం 5, 6 వార్డుల్లో అధికారులు లేరనే సమాచారం ఎమ్మెల్యేకు తెలియడం వల్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.
సచివాలయాల్లో సిబ్బంది గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం - గ్రామ సచివాలయం ఉద్యోగులపై కందుకూరు ఎమ్మెల్యే ఆగ్రహం
కందుకూరు గ్రామ సచివాలయాల్లో 5, 6 వార్డుల్లో బుధవారం అధికారులు గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డికి చేరవేశారు. ఈ విషయంపై ఆరా తీసిన ఎమ్మెల్యే గురువారం ఉద్యోగులను హెచ్చరించారు.
గ్రామ సచివాలయం అధికారులపై మండిపడ్డ కందుకూరు ఎమ్మెల్యే