వ్యవసాయంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడతాయని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేట రైతు భరోసాకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా.. అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన వారికోసం ప్రత్యేక పథకం తీసుకురావడం సంతోషకరమన్నారు.
'వ్యవసాయంలో సూచనలు, సలహాలు ఇచ్చేందుకే రైతు భరోసా కేంద్రాలు' - grain purchasing center at kothapeta
అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన వారికోసం ప్రత్యేక పథకం తీసుకురావడం సంతోషకరమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ప్రకాశం జిల్లా కొత్తపేట రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
కొత్తపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
చీరాల ప్రాంతంలో ఎన్ఎల్ఆర్ 145 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందని.. వెంటనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పలు స్థానిక సమస్యలపై ఎమ్మెల్యేకు రైతులు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి:'ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే మళ్లీ ఆశ్రయించవచ్చు'
Last Updated : Feb 24, 2021, 4:48 PM IST
TAGGED:
ప్రకాశం జిల్లా తాజా వార్తలు