ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాంలో కలకలం రేపిన సర్పంచి అభ్యర్థి కిడ్నాప్ ఉత్కంఠ వీడింది. పెదగంజాం సర్పంచ్ అభ్యర్ధి తిరుపతిరావు అపహరణకు గురవ్వగా.. ఆయన క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తిరుపతిరావును తీసుకెళ్లిన అంకమ్మరెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావు కుటుంబసభ్యులతో మాట్లాడిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.
అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి క్షేమం - mla sambashiva rao latest news
ప్రకాశం జిల్లాలో కలకలం రేపిన సర్పంచి అభ్యర్థి కిడ్నాప్‌కు తెరపడింది. అపహరణకు గురైన తిరుపతిరావును పోలీసులు క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
![అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి క్షేమం missing sarpanch candidate in prakasam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10442864-710-10442864-1612041251730.jpg)
అపహరణకు గురైన సర్పంచ్ అభ్యర్థి క్షేమం