ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కందళ్లపల్లికి చెందిన రవి, గురునాధం అనే ఇద్దరు రైతులు మిర్చి అమ్మేందుకు లారీలో గుంటూరు వెళుతున్నారు. మార్కాపురం మండలం గజ్జలకొండ వద్దకు రాగానే పైన ఉన్న కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగి లారీలో ఉన్న మిరపకాయలు కాలిపోయాయి. వీటి విలువ సుమారు 15లక్షల రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. కష్టపడి పండించిన సరుకు కళ్లెదుటే కాలిపోవడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు.