రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన మంత్రి.. జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా అధిక సంఖ్యలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించడంతో పాటు రికవరీ రేటు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నందున జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, వ్యాక్సినేషన్ విషయంలోనూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని మంత్రి అన్నారు.
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి...
జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు పాత్ర వహించాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ. శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావాలని కోరారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్..