రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి: మంత్రి సురేష్ - suresh
రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన ఈ సమావేశంలో తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. పాఠశాలల స్థితిగతులను మార్చేందుకు ఒక ప్రణాళిక తో పనిచేసి ఫలితాలు సాధిస్తామన్నారు. రాజన్న బడిబాటలో భాగంగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడమే ప్రభుత్వ లక్షమన్నారు. భాషా పండితుల సమస్యలపై కమిటీ వేసి నివేదిక ఆధారంగా వారి సమస్యలు పరిషరిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.