ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో రైతుమిత్ర గ్రూపుల నిధుల గోల్మాల్ వ్యవహారంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ సీరియస్ అయ్యారు. రైతులకు ఉపయోగపడే నిధులను అక్రమంగా డ్రా చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాబురావుతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ జరిపామని బాబురావు వివరించారు. తన నియోజకవర్గంలో ఇలాంటిది సహించేది లేదని మంత్రి తేల్చిచెప్పారు. వెంటనే నిధులు డ్రా చేసిన వాళ్లనుంచి రికవరీ చేసి నిందితులపై కేసు నమోదు చేయాలన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని ఐకేపి కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానన్నారు.
రైతుమిత్ర గ్రూపుల నిధులు గోల్మాల్.. మంత్రి సురేశ్ సీరియస్ - minister suresh latest news
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో రైతుమిత్ర గ్రూపుల నిధుల్లో అక్రమాల వ్యవహారంపై మంత్రి ఆదిమూలపు సురేశ్ సీరియస్ అయ్యారు. అక్రమంగా డ్రా చేసిన డబ్బును వెంటనే రికవరీ చేయాలని జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాబురావును ఆదేశించారు.
minister suresh on Rythu Mitra Groups funds fraud